Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ లో ఎయిర్ ట్యాక్సీలు... తొలి స్టేషన్ నిర్మాణం

Hamdan bin Mohammed Announces Dubai Air Taxi Station Completion
Advertisement
  • అందుబాటులోకి రానున్న ఎయిర్ ట్యాక్సీ సేవలు
  • ట్రాఫిక్‌ రద్దీకి చెక్ పెట్టడమే ప్రధాన ఉద్దేశం
  • 45 నిమిషాల ప్రయాణం ఇకపై 10 నిమిషాల్లోనే..!
Advertisement
నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టి, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే దిశగా దుబాయ్ ప్రభుత్వం తన ప్రతిష్ఠాత్మక ‘ఎయిర్ ట్యాక్సీ’ ప్రాజెక్టును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ (వర్టిపోర్ట్) నిర్మాణం పూర్తిచేసింది. ఈ విషయాన్ని దుబాయ్‌ యువరాజు హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రకటించారు. 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ లో ఏటా 1,70,000 మంది ప్రయాణించడానికి వీలుగా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ స్టేషన్‌ ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే రద్దీని బట్టి సుమారు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అయితే, ఈ ఎయిర్ ట్యాక్సీల ద్వారా కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. 2026 చివరి నాటికి ఈ సేవలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరా వంటి నాలుగు కీలక ప్రాంతాల్లో ఈ వర్టిపోర్టులను నిర్మించనున్నారు. 

ఈ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిగా విద్యుత్‌తో నడిచే వాహనాలు. హెలికాప్టర్ల తరహాలో నిలువుగా గాల్లోకి లేచి, నిలువుగా ల్యాండ్ అవుతాయి. వీటికి రన్‌వే అవసరం లేకపోవడంతో పాటు, తక్కువ శబ్దం చేస్తూ పర్యావరణహితంగా పనిచేస్తాయి.

ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల రాకతో పర్యాటకులు, వ్యాపారవేత్తలు విమానాశ్రయం నుంచి నేరుగా తమ గమ్యస్థానాలకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement
Hamdan bin Mohammed
Dubai air taxi
air taxi
Dubai airport
Palm Jumeirah
Dubai Metro
Dubai RTA
vertiport
urban air mobility
flying car

More Telugu News