ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు

Donald Trump praises Delhi Lieutenant Governor Sandhu
  • మోదీ తనకు అత్యంత ఆప్తుడు అన్న ట్రంప్
  • దేశం కోసం మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు
  • సంధు నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య

అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందనడానికి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఆయన దేశం కోసం అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. 


ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన 40 నిమిషాల సుదీర్ఘ ఫోన్ సంభాషణలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇదే క్రమంలో ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ సింగ్ సంధుపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో భారత రాయబారిగా సంధు అందించిన సేవలు ఇరుదేశాల బంధాన్ని బలోపేతం చేశాయని, ఆయన నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

Go Back to Shorts
Donald Trump
Narendra Modi
Taranjit Singh Sandhu
India US relations
Delhi Lieutenant Governor
India foreign policy
West Asia tensions
Hormuz Strait

More Telugu News