శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి
- ఈత కోసం బావిలోకి దిగి బాలుడు, యువకుడి మృతి
- మృతులు త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తింపు
- బాలుడిని కాపాడే ప్రయత్నంలో మునిగిపోయిన యువకుడు
వివరాల్లోకి వెళితే.. అరవకొత్తూరు గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి త్రిశూల్, ఈత నేర్చుకోవాలనే ఆసక్తితో తన స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈత రాకపోయినా, సరదాగా బావిలోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతుండటంతో భయంతో కేకలు వేశాడు.
అతడి అరుపులు విని సమీపంలో ఉన్న తరుణ్ రెడ్డి అనే యువకుడు వెంటనే స్పందించి, త్రిశూల్‌ను కాపాడేందుకు బావిలోకి దూకాడు. కానీ, దురదృష్టవశాత్తు లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.