దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

  • హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం
  • ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు
  • భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను అతి కిరాతకంగా చంపి, ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరకాలకు చెందిన సుమన్ ఒక రెస్టారెంటులో పని చేస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు. భార్యకు కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో తన భర్తను వదిలించుకోవాలనుకున్న లావణ్య, ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందుకోసం ఒక ముఠాకు సుఫారీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె కొద్దిరోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత, ఈ నెల 3వ తేదీ నుంచి భర్త సుమన్ కనిపించకుండా పోయాడు. కొడుకు కోసం వెతికిన సుమన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా, ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించింది. సుఫారీ గ్యాంగ్ మొదట అతనిని బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపింది. ఈనెల 4వ తేదీన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దయ్యాలవాగు సమీపంలో సుమన్‌పై పెట్రోల్ పోసి కాల్చివేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఆ తర్వాత ఎనిమిది మందిని అరెస్టు చేశారు. లావణ్యతో పాటు ప్రియుడు, సుఫారీ తీసుకున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Lavanya
Hanamkonda crime
extramarital affair murder
Parakala murder case
Supari killing
Telangana crime news

More Telugu News