అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా.. సాయం చేసిన చైనా శాటిలైట్!
- గతేడాది రహస్యంగా శాటిలైట్‌ను సమకూర్చుకున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
- సౌదీ, జోర్డాన్, ఇరాక్‌లోని యూఎస్ బేస్‌ల కదలికలను ట్రాక్ చేసిన వైనం
- చైనా ప్రభుత్వ అనుమతితోనే ఇది జరిగిందంటున్న నిపుణులు
- ఇరాన్‌కు సైనిక సాయం లేదంటూ కొట్టిపారేస్తున్న చైనా
పశ్చిమాసియాలో ఇటీవల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు ఇరాన్ చైనా తయారీ శాటిలైట్‌ను ఉపయోగించుకుందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది.
ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, గతేడాది ఇరాన్ రహస్యంగా పొందిన ఈ శాటిలైట్ పేరు TEE-01B. దీనిని చైనాకు చెందిన 'ఎర్త్ ఐ కంపెనీ' అభివృద్ధి చేసి ప్రయోగించింది. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఏరోస్పేస్ విభాగానికి దీనిని అప్పగించారు. కక్ష్యలోకి విజయవంతంగా చేరిన తర్వాతే విదేశీ కొనుగోలుదారులకు ఉపగ్రహాలను బదిలీ చేసే 'ఇన్-ఆర్బిట్ డెలివరీ' అనే పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా బీజింగ్‌కు చెందిన ఎంపోశాట్ అనే మరో సంస్థకు చెందిన కమర్షియల్ గ్రౌండ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా ఇరాన్ వినియోగించుకునేందుకు అనుమతి లభించింది.
ఈ శాటిలైట్‌ను ఉపయోగించి పశ్చిమాసియాలోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిఘా పెట్టింది. మార్చి 13, 14, 15 తేదీల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ చిత్రాలను ఈ శాటిలైట్ బంధించింది. అదే సమయంలో జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమీప ప్రాంతాలు, ఇరాక్‌లోని ఎర్బిల్ ఎయిర్‌పోర్ట్ వద్ద కార్యకలాపాలను కూడా ట్రాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కువైట్‌లోని క్యాంప్ బ్యూహ్రింగ్, అలీ అల్ సేలం ఎయిర్ బేస్ వంటి అమెరికా సంబంధిత స్థావరాలు కూడా దీని నిఘా నీడలోనే ఉన్నాయి.
"చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ చైనా కంపెనీ ఇలాంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం అసాధ్యం. చైనా చాలా కాలంగా ఇరాన్‌కు నిఘా సమాచారంతో సాయం చేస్తోంది, అయితే ప్రభుత్వ ప్రమేయం బయటపడకుండా జాగ్రత్త పడుతోంది" అని పాశ్చాత్య దేశాలకు చెందిన ఓ మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్‌కు ఎలాంటి సైనిక మద్దతు ఇవ్వడం లేదని చైనా విదేశాంగ శాఖ గత కొన్ని రోజులుగా ఖండిస్తూ వస్తోంది.
చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి మద్దతు ఇస్తోందని, క్షిపణుల తయారీకి ఉపయోగపడే ద్వంద్వ వినియోగ పారిశ్రామిక భాగాలను అందిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా-ఇరాన్ బంధంపై గల్ఫ్ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.