Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నారా లోకేశ్ పై మంత్రులు నారాయణ, అనిత ప్రశంసలు

Nara Lokesh Praised by Ministers Narayana and Anitha
Advertisement
  • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్
  • తండ్రికి తగ్గ తనయుడన్న మంత్రి నారాయణ
  • ఐటీ, విద్యా శాఖల్లో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని ప్రశంస
Advertisement

తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితుడవడం పట్ల ఆ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ నియామకాన్ని స్వాగతిస్తూ మంత్రులు నారాయణ, అనిత ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.


నారా లోకేశ్ 'తండ్రికి తగ్గ తనయుడు' అని నారాయణ కొనియాడారు. పార్టీ బాధ్యతలను, మంత్రిత్వ శాఖను సమాంతరంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ఐటీ, విద్యాశాఖల్లో లోకేశ్ తీసుకొచ్చిన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువత కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

హోం మంత్రి అనిత కూడా లోకేశ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే, పార్టీ ప్రకటించిన నూతన కమిటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టపడే తత్వం, అనుభవం, సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేస్తూ ఈ కమిటీలను రూపొందించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పారు. లోకేశ్ తో పాటు ఇతర పొలిట్ బ్యూరో సభ్యులకు కూడా ఆమె తన అభినందనలు తెలియజేశారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Telugu Desam Party
TDP
Narayana Minister
Anitha Minister
Andhra Pradesh Politics
AP Politics
Working President
Political Committee

More Telugu News