భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'ధురంధర్' సరికొత్త రికార్డు

  • 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లు
  • రూ.1,000 క్లబ్‌లో చేరిన 'ధురంధర్' చిత్రం రెండు భాగాలు
  • బాహుబలి, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాలను దాటేసిన ధురంధర్
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా ఫ్రాంచైజీకి సాధ్యంకాని అరుదైన మైలురాయిని అందుకుంది. 'ధురంధర్' రెండు భాగాలు కలిపి రూ.3,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలు కలిసి అక్షరాలా రూ.3,019 కోట్లను రాబట్టాయి. ధురంధర్ మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం.

ధురంధర్ చిత్రం రూ.1,307 కోట్లకు పైగా, ధురంధర్: ది రివెంజ్ రూ.1,712 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.3,019 కోట్ల వసూళ్లను రాబట్టాయి.

బాహుబలి మొదటి భాగం రూ.650 కోట్లు, రెండో భాగం రూ.1,788 కోట్లు వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.2,438 కోట్లు వసూలు చేశాయి. పుష్ప చిత్రం రూ.350 కోట్లు వసూలు చేయగా, పుష్ప-2 రూ.1,742 కోట్లను రాబట్టింది. ఈ రెండు చిత్రాలు కలిపి రూ.2,092 కోట్లు వసూలు చేశాయి.



Ranveer Singh
Dhurandhar movie
Aditya Dhar
Indian cinema
Box office collection
Bollywood movies

More Telugu News