నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్

Nivetha Pethurajs Second Innings Focus on Career Again
  • గతంలో రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడ్డ నివేదా
  • తాజాగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న రజిత్
  • మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్న నివేదా

'మెంటల్ మదిలో', 'చిత్రలహరి' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు విరామం ఇచ్చి ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ నటి, బిజినెస్ మేన్ రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడి 2023లో వెండితెరకు దూరమయింది.


పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇద్దరూ హింట్ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తాజాగా రజిత్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో, నివేదా తన గతాన్ని వదిలేసి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. గతంలో స్టార్ హీరోలతో నటించిన నివేదా... ఇప్పుడు కథలో ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రనైనా (క్యారెక్టర్ రోల్స్) చేయడానికి సిద్ధమని మేకర్స్‌కు సందేశాలు పంపుతున్నట్టు సమాచారం.

ప్రేమ కోసం, ఎదుగుతున్న కెరీర్‌ను పణంగా పెట్టిన నివేదా పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న నటి కాబట్టి ఆమెకు మంచి కమ్‌బ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Go Back to Shorts
Nivetha Pethuraj
Nivetha Pethuraj comeback
Mental Madilo
Chitralahari
Rajith Ibran
Telugu cinema
Tollywood actress
Career focus
Character roles
Love breakup

More Telugu News