బావిలో పడ్డ సింహం.. గంట శ్రమించి కాపాడిన అధికారులు.. వీడియో ఇదిగో!

Gir Lion Rescued from Well in Amreli Gujarat
  • గుజరాత్‌లో 15 అడుగుల బావిలో పడిన సింహం
  • ఆరోగ్యంగా ఉన్న సింహాన్ని తిరిగి గిర్ అడవిలోకి వదిలిపెట్టిన అధికారులు
  • బావులకు రక్షణ గోడలు నిర్మించుకోవాలని రైతులకు అధికారుల సూచన
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఓ సింహం ప్రమాదవశాత్తూ 15 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, గంటకు పైగా శ్రమించి ఆ మృగరాజును సురక్షితంగా బయటకు తీశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ సినిమాను తలపించేలా సాగింది. వివరాల్లోకి వెళితే.. అమ్రేలి జిల్లా పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆహారం కోసమో, నీటి కోసమో వెతుకుతూ వచ్చిన సింహం పొరపాటున బావిలో పడిపోయింది. ఉదయం సింహం గర్జనలు విన్న స్థానికులు దానిని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సింహాన్ని బయటకు తీసుకురావడానికి బావిలోకి తాడు వదిలారు. ఒడ్డున ఓ బోనును పెట్టి తాడు సాయంతో పైకి వచ్చిన సింహాన్ని అందులోకి చేర్చారు. బయటకు తీసిన సింహానికి ఎలాంటి గాయాలు కాలేదని, అది పూర్తి ఆరోగ్యంతో ఉందని అధికారులు నిర్ధారించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం దానిని తిరిగి గిర్ అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు. పొలాల్లోని బావులకు రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
Go Back to Shorts
Gir Lion
Gujarat
Amreli
Lion Rescue
Well Accident
Forest Department
Rescue Operation
Gir Forest

More Telugu News