ఇక చౌకగానే ఇంటర్నెట్
ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది కాస్త ఖరీదైన వ్యవహారం. దీంతో అనేక పేద దేశాల్లో ఇంటర్నెట్ అనేది అందని ద్రాక్షగా ఉంటూ అందరినీ ఊరిస్తుంటుంది. అయితే, ఈ డిజిటల్ అంతరాన్ని తొలగించాలనుకున్న గూగుల్ ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో ఇక అందరికీ ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి రానుంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో పలు సంచలనాలకు గూగుల్‌ని మారుపేరుగా చెబుతారు. ఇప్పుడు ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ మరో తాజా సంచలనానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచంలోని సుమారు 480 కోట్లమంది జనాభాకు కలలాంటి ఇంటర్నెట్‌ను అందించాలనే లక్ష్యంతో గూగుల్ సుమారు 18 నెలల క్రితం రహస్యంగా ఒక ప్రాజెక్టును చేపట్టింది.
'ప్రాజెక్ట్ లూన్' పేరుతో ప్రారంభించిన ఈ రహస్య ప్రాజెక్టు ద్వారా బెలూన్లను ఆకాశంలోకి పంపించి వాటి ద్వారా భూమిమీది ఏ ప్రాంతంలోకైనా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడాన్ని ప్రయత్నించింది. ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్లను ఆకాశంలోకి పంపించి వాటి ద్వారా మారుమూల ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ఈ ప్రయోగం లక్ష్యం. దీంతో ఎందరికో కలలాంటి ఇంటర్నెట్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుంది.