ములుగు జిల్లాలో ఘోరం.. కోతుల కోసం పెట్టిన విషం.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది!
ములుగు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు పెట్టిన విషపూరిత ఆహారం, నాలుగేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే... గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, వస్తువులు ఎత్తుకెళ్తుండటంతో విసిగిపోయిన స్థానికులు, వాటిని తరిమికొట్టేందుకు ఆహారంలో విషం కలిపి బయట పెట్టారు. అయితే, ఆడుకుంటున్న నాలుగేళ్ల అశ్విన్ నందన్ అనే బాలుడు ఆ విషాహారాన్ని తిన్నాడు.
కొద్దిసేపటికే బాలుడు అస్వస్థతకు గురవడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. తమ కళ్లెదుటే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కోతుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.