ఆశా భోంస్లే కేవలం ఒక గాయని కాదు... ఒక శకానికి గుండె చప్పుడు: రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ గాయని, లెజెండ్ ఆశా భోంస్లే మృతి పట్ల ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కేవలం ఒక గాయని మాత్రమే కాదని, ఒక శకానికి గుండెచప్పుడు వంటి వారని అభివర్ణించారు. ఆశాజీతో తనకున్న అనుబంధాన్ని, ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వర్మ నివాళులర్పించారు.
"ఈరోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, లెజెండరీ ఆశా భోంస్లే గారి మరణ వార్త విని తీవ్రంగా చలించిపోయాను. ఆమె గురించి ఆలోచిస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. 'రంగీలా' సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించినా, ఆ పాటలకు అమరత్వాన్ని, యవ్వనపు ఉత్సాహాన్ని ఇచ్చింది కేవలం ఆశా గారి గొంతు మాత్రమే. "రంగీలా రే" కేవలం ఒక పాట కాదు, బాలీవుడ్‌ను కుదిపేసిన ఒక ఉరుములాంటిది. ముంబై వీధుల్లో ఊర్మిళా మటోండ్కర్ ఎలక్ట్రిఫైయింగ్ స్టెప్పులకు, ఆశా గారి కొంటెతనం, ఉత్సాహం నిండిన గానం తోడై వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ సృష్టించాయి.
ఆమె స్టూడియోలోకి అడుగుపెట్టే తీరే వేరు. ఒక మహారాణిలా వచ్చినా, రెహమాన్ లాంటి కొత్త తరం సంగీత దర్శకుడితో పనిచేస్తున్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే చిన్నపిల్లల కుతూహలంతో ఉండేవారు. ఒకే టేక్‌లో, చిన్న చిన్న మార్పులతో ఆమె పాడే విధానం ఓ ప్రభంజనంలా ఉండేది.
యాదృశ్చికంగా, ఈరోజే నా సినిమా 'కంపెనీ'లోని 'ఖల్లాస్' పాట విడుదలై 24 ఏళ్లు పూర్తయింది. ఇషా కొప్పికర్‌పై చిత్రీకరించిన ఆ హై ఓల్టేజ్ ఐటమ్ సాంగ్, ఆశా గారి పవర్‌ఫుల్ వాయిస్ వల్లే ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఆ పాట ఇప్పటికీ అదే శక్తితో వినిపిస్తుంది.
ఆశా గారు కేవలం ఒక గాయని కాదు, ఆమె ఒక తరం మొత్తానికి గుండెచప్పుడు. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక బీట్స్ వరకు, ఎన్నో భాషల్లో, ఎన్నో భావోద్వేగాలను తన గొంతులో పలికించారు. మనుషుల అన్ని రకాల భావాలను ఆమెలా పండించిన వారు మరొకరు లేరు. మీరు మరో లోకానికి వెళ్లి ఉండొచ్చు ఆశా జీ, కానీ మీ సంగీతం ఇక్కడ శాశ్వతంగా ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ వర్మ ఎమోషనల్ ట్వీట్ చేశారు.