చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా

Iran US Negotiations Fail What Happens Next in West Asia
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన సుదీర్ఘ శాంతి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ బృందాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే, ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. పశ్చిమాసియాలో అమలవుతున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంతో ఇకముందు ఏం జరగనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మూడు ఆప్షన్ లు..
చర్చలు విఫలమవడంతో మూడు ప్రధాన పరిణామాలు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మొదటిది.. కాల్పుల విరమణ ముగిసిన వెంటనే మళ్లీ యుద్ధం ప్రారంభం కావడం. ఇప్పటికే ఇరాన్ తన క్షిపణులను సిద్ధం చేసుకుందన్న సమాచారంతో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇది ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది.
రెండోది.. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం. ఇది ఇరాన్ చేతిలో ఉన్న శక్తిమంతమైన అస్త్రం. దీనిని ప్రయోగిస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి.
మూడోది.. చైనా వంటి దేశాలు ఇరాన్‌కు బహిరంగంగా సైనిక మద్దతు పలకడం. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

పట్టువీడని ఇరు దేశాలు..
చర్చల సందర్భంగా తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబట్టగా, హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత రవాణాకు హామీ ఇవ్వడంతో పాటు చైనా నుంచి ఆయుధాలు తీసుకోవడం ఆపాలని అమెరికా షరతు విధించింది. తమ తమ డిమాండ్ల విషయంలో రెండు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. శాంతి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇప్పుడు అందరి దృష్టి కాల్పుల విరమణ తర్వాత పశ్చిమాసియాలో జరగబోయే పరిణామాలపైనే కేంద్రీకృతమై ఉంది.
Go Back to Shorts
Iran
Iran US talks
West Asia tensions
US Iran negotiations
Hormuz Strait
Middle East conflict
Ceasefire
Oil prices
China military support
Israel

More Telugu News