వివాహం తర్వాత మళ్లీ షూటింగ్‌కు విజయ్-రష్మిక... 'రణబాలి' సెట్స్ పై సంబరాలు

Vijay Deverakonda and Rashmika Join Ranabali Movie Shoot After Wedding
వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తాము కలిసి నటిస్తున్న 'రణబాలి' సినిమా షూటింగ్‌లో ఈ జంట పాల్గొంది. పెళ్లి తర్వాత తొలిసారి సెట్స్‌లో అడుగుపెట్టిన వీరికి చిత్ర యూనిట్ ఘనంగా స్వాగతం పలికి, సంబరాలు జరిపింది. బొకేలు ఇచ్చిన యూనిట్ సభ్యులు విషెస్ తెలిపారు. అంతేకాదు, కొత్త జంటతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. వీరి పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

19వ శతాబ్దపు రాయలసీమ చారిత్రక సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ 'రణబాలి' అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనుండగా, రష్మిక 'జయమ్మ' పాత్రను పోషిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను రాయలసీమ ప్రాంతంలో పూర్తి చేశారు.

అద్భుతమైన తారాగణం, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న 'రణబాలి' చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.
Go Back to Shorts
Vijay Deverakonda
Rashmika Mandanna
Ranabali Movie
Rahul Sankrityan
Maitri Movie Makers
Rayalaseema
Geetha Govindam
Dear Comrade
Pan India Movie
Telugu Cinema

More Telugu News