అభిమాని ప్రేమకు చలించిపోయిన సింగర్ మంగ్లీ.. కారు ఆపి నడిరోడ్డుపై సెల్ఫీ.. వైరల్ వీడియో!

ప్రముఖ గాయని మంగ్లీ తన అభిమాని పట్ల చూపిన ఆదరణ సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటోంది. తన మీద అభిమానంతో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' అని పేరు పెట్టుకోవడం చూసి ఆమె చలించిపోయారు. స్వయంగా నడిరోడ్డుపై కారు ఆపి మరీ అతడిని కలిసి, సెల్ఫీ దిగి సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ప్రయాణిస్తుండగా, ఒక ఆటో వెనుక 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' అని రాసి ఉండటాన్ని మంగ్లీ గమనించారు. వెంటనే తన కారును ఆపి, ఆ ఆటో డ్రైవర్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

"ఈరోజు నా మనసు కదిలిపోయింది. ఒక అద్భుతమైన అభిమాని తన ఆటో మీద నా పేరును ‘మంగ్లీ ఎక్స్‌ప్రెస్’ అని రాసుకున్నారు. అదొక చిన్న విషయమే అయినా, దాని విలువ మాత్రం నాకు ఎంతో ఎక్కువ. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 'ఆటోవాలా అన్న' చూపిన ఈ ప్రేమే నాకు ప్రతి అడుగులోనూ ప్రేరణ" అని మంగ్లీ పేర్కొన్నారు. ఆమె సింప్లిసిటీని, అభిమానుల పట్ల చూపిస్తున్న గౌరవాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Mangli
Mangli Express
auto driver
viral video
singer Mangli
fan appreciation
Telugu singer
social media
celebrity interaction
Hyderabad

More Telugu News