రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్‌ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విడుదల రోజే ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. రేపు శుక్రవారం సినిమా రిలీజ్ రోజున హైదరాబాద్, వైజాగ్‌లోని పలు థియేటర్లను సందర్శించి, అభిమానులతో కలిసి సినిమా సంబరాలు జరుపుకోనున్నట్లు నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 10న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ సహా చిత్ర బృందం సందడి చేయనుంది. హైదరాబాద్ పర్యటన ముగిసిన తర్వాత, అదే రోజు మధ్యాహ్నం షోకు వైజాగ్‌లోని సంగం థియేటర్‌లో, సాయంత్రం గల షోకు గాజువాకలోని శ్రీ కన్య థియేటర్‌లో ప్రేక్షకులను కలవనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వివరాలను పంచుకుంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. 

Adivi Sesh
Decoit Movie
Mrunal Thakur
Adivi Sesh Movie Release
Decoit Release Date
Hyderabad Theaters
Vizag Theaters
Telugu Movie 2024
Annapurna Studios

More Telugu News