మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు

మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.


ఇటీవల మీడియా సంస్థలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ... వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలను ఏ రాజకీయ పార్టీ చేసినా తాను తీవ్రంగా ఖండిస్తానని స్పష్టం చేశారు.


మాతృభాషను మర్చిపోవడం అంటే అమ్మను మర్చిపోవడమేనని, జన్మనిచ్చిన తల్లిని, ఊరిని, దేశాన్ని ఎప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియా ఊబిలో పడి సమయాన్ని వృథా చేయవద్దని, చదువుతో పాటు ఆటలకు, యోగాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజకీయ వారసత్వానికి తాను వ్యతిరేకినని, అయితే సేవా కార్యక్రమాలు కొనసాగించే కుటుంబాలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఆహారపు అలవాట్లను మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

Venkaiah Naidu
Media freedom
Attacks on media
Chittoor
N P Savitramma college
Mother tongue
Political attacks
India
Muppavarapu Venkaiah Naidu

More Telugu News