నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన స్థానికుడు.. వీడియో ఇదిగో!

Nepal Local Forces Indian Tourists to Clean Gutka Spit
షార్ట్స్‌లో చూడండి
నేపాల్‌లో భారత పర్యాటకుల బృందానికి ఊహించని అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి రోడ్డుపై గుట్కా ఉమ్మడంతో స్థానిక వ్యక్తి వారిని అడ్డుకుని నిలదీశాడు. వారితోనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నేపాల్‌లోని ఓ రహదారిపై వెళ్తున్న వాహనంలో నుంచి భారత పర్యాటకులు గుట్కా ఉమ్మడాన్ని ఓ స్థానిక వ్యక్తి గమనించాడు. వెంటనే వారి కారును ఆపి "ఇది ఇండియా కాదు సోదరా... ఇది నేపాల్... వెంటనే నీళ్లు పోసి కడగండి" అని హిందీలో గట్టిగా హెచ్చరించాడు. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతూ పలుమార్లు క్షమాపణలు చెప్పారు.

అయినా ఆ వ్యక్తి శాంతించలేదు. "మీరు అంత పెద్ద దేశం నుంచి వచ్చి ఇక్కడ ఇలా చెత్త చేస్తున్నారు" అంటూ, కేవలం క్షమాపణ చెబితే సరిపోదని, ఆ మరకలను శుభ్రం చేయాలని స్పష్టం చేశాడు. దీంతో పర్యాటకులు నీళ్లు పోసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో లక్షలాది వ్యూస్ సాధించడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పౌర స్పృహ లేనివారికి తగిన బుద్ధి చెప్పాడంటూ చాలా మంది భారతీయుల సహా నేపాలీ వ్యక్తిని ప్రశంసించారు. అయితే మరికొందరు మాత్రం అతడి తీరును తప్పుబట్టారు. పర్యాటకులు క్షమాపణ చెబుతున్నా, దేశం పేరుతో నిందించడం సరికాదని, ఇది అతిథులను అవమానించడమేనని విమర్శించారు. 
Go Back to Shorts
Nepal Tourists
Indian Tourists Nepal
Gutka Spitting
Nepal Road Incident
Viral Video
India Nepal Relations
Public Awareness
Tourism Ethics
Social Media Viral
Road Etiquette

More Telugu News