హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
- సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం
- నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఈడ్చుకెళ్లిన కారు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు.
కాలేజీ విద్యార్థులు కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.