యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Prices Soar After War Ceasefire
షార్ట్స్‌లో చూడండి
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు చేరింది. కిలో వెండి రూ.10 వేలు పెరిగి నిన్నటితో పోలిస్తే రూ.2.65 లక్షలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.1,53,970 వద్ద ఉండగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,41,150 వద్ద కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Gold prices
Silver prices
War ceasefire
West Asia tensions
Hyderabad gold rate
Delhi gold rate

More Telugu News