పంజాబీ నటితో ప్రేమలో క్రికెటర్ అర్షదీప్ సింగ్?

టీమిండియా స్టార్ పేసర్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అర్షదీప్ ప్రేమలో ఉన్నాడంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


వివరాల్లోకి వెళితే... అర్షదీప్ సింగ్ ఇటీవల తన స్నాప్‌చాట్ ఖాతాలో ఒక అమ్మాయి చేయి పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అందులో ఆ అమ్మాయి ముఖం కనిపించనప్పటికీ, ఆమె చేతిపై ఉన్న ఒక ప్రత్యేకమైన టాటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.


నెటిజన్ల పరిశోధన ప్రకారం.. ఆ టాటూ పంజాబ్‌కు చెందిన ప్రముఖ మోడల్, నటి సమ్రీన్ కౌర్ చేతిపై ఉన్న టాటూతో సరిపోలింది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అభిమానులు ఒక అంచనాకు వచ్చారు.


సమ్రీన్ కౌర్ గురించి కొన్ని విశేషాలు:

26 ఏళ్ల సమ్రీన్ పంజాబ్‌కు చెందిన నటి. పుణేలోని సింబయోసిస్ కాలేజీలో విద్యాభ్యాసం చేసింది. 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.


అయితే ఈ వార్తలపై అర్షదీప్ కానీ, సమ్రీన్ కౌర్ కానీ ఇప్పటి వరకు స్పందించనప్పటికీ... వీరికి సంబంధించిన వార్త మాత్రం వైరల్ అవుతోంది.


Arshdeep Singh
Samreen Kaur
Punjab Kings
Indian cricketer
Punjabi actress
dating rumors
social media
relationship
model
Miss India

More Telugu News