ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు
ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్‌ఛార్జీని సవరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. దేశీయ మార్గాలకు సంబంధించి, బుధవారం నుంచి ఫ్లాట్ సర్‌ఛార్జీ స్థానంలో దూరం ఆధారిత విధానానికి మారనున్నట్లు ఆ విమానయాన సంస్థ తెలిపింది.
దేశీయంగా 500 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు రూ.299 నుంచి 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణాలకు రూ.899 సర్‌ఛార్జ్‌ను సవరిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ విమాన సర్వీసులకు 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు వసూలు చేయనున్నట్లు తెలిపింది. సవరించిన ఛార్జీలు డొమెస్టిక్ ప్రయాణాలకు ఏప్రిల్ 8వ తేదీ నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు 10వ తేదీ నుంచి వసూలు చేస్తామని తెలిపింది.
దేశీయ ప్రయాణాలకు 0 నుంచి 500 కిలోమీటర్ల వరకు రూ.299,
501 నుంచి 1000 కిలోమీటర్ల వరకు రూ.399,
1001 నుంచి 1500 కిలోమీటర్ల వరకు రూ.549,
1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు రూ.749,
2000 నుంచి అంతకుమించి కిలోమీటర్లకు రూ.899 వసూలు చేస్తారు.
అంతర్జాతీయ ప్రయాణం విషయానికి వస్తే పశ్చిమాసియాకు 50 డాలర్లు, ఆగ్నేయాసియాకు 100 డాలర్లు, సింగపూర్‌కు 60 డాలర్లు, ఆఫ్రికాకు 130 డాలర్లు, యూకేకు 205 డాలర్లు, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు 280 డాలర్ల చొప్పున ఫ్యూయల్ సర్‌ఛార్జిని వసూలు చేయనున్నట్లు ఎయిరిండియా గ్రూప్ తెలిపింది.