Virat Kohli: టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ

Virat Kohli Breaks Rohit Sharmas T20 Record
షార్ట్స్‌లో చూడండి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేయడం ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ తిరగరాశాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1,161 పరుగులతో రోహిత్ శర్మ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో చెన్నైపై కోహ్లీ మొత్తం పరుగుల సంఖ్య 1,188కి చేరింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆసక్తికరంగా, ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్‌పై 1,159 పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో కూడా ఉండటం విశేషం.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు. దేవదత్ పడిక్కల్ (50), ఫిలిప్ సాల్ట్ (46) శుభారంభం అందించగా, కెప్టెన్ రజత్ పటిదార్ (48), టిమ్ డేవిడ్ (70) ఆకాశమే హద్దుగా చెలరేగారు.  ఈ ఇద్దరూ కేవలం 36 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. 
Go Back to Shorts
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Chennai Super Kings
CSK
T20 cricket
Rohit Sharma
Cricket Records
Smallswami Stadium

More Telugu News