Alluri Sitarama Raju district: అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పాడేరు, హుకుంపేట, పెదబయలు, అరకులోయ మండలాల్లో సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైనట్లు సమాచారం.

అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరుకున్నారు. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
 
Alluri Sitarama Raju district
Andhra Pradesh earthquake
earthquake
Paderu
Hukumpeta
Araku Valley
seismic activity
AP earthquake
Alluri district

More Telugu News