Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక 'రణబాలి' రాయలసీమ షెడ్యూల్ పూర్తి
రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం 'రణబాలి' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రాయలసీమలో చేపట్టిన కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రాయలసీమ ప్రజలు తమకు ఎంతో ప్రేమను పంచారని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది.
షూటింగ్ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "నా సొంత ఊరికి వచ్చినట్లు అనిపిస్తోంది. అనంతపురం నా రెండో సొంతూరిలా ఉంది. నాలో ఎప్పుడూ ఒక సీమ ఫీలింగ్ ఉంటుంది" అని అన్నారు. ఈ చిత్రంలో విజయ్ 'రణబాలి' పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య 'జయమ్మ' పాత్రలో రష్మిక కనిపించనుంది. సెప్టెంబర్ 11న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 19వ శతాబ్దంలోని బ్రిటిష్ పాలన నేపథ్యంలో రూపొందిస్తున్నారు. 1854-1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చరిత్రలో చోటు దక్కని, బ్రిటిష్ వారు తప్పుగా చిత్రీకరించిన అనేక సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. 'ది మమ్మీ' ఫేమ్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటిస్తున్న మూడో సినిమా కావడంతో 'రణబలి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును టి-సిరీస్ సమర్పిస్తోంది.