Iran Israel war: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆహార ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో, అంతర్జాతీయంగా ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు, ఇంధన ధరల కొరత, పెరుగుదల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతోంది. అంతర్జాతీయ ఆహార ధరల సూచీ ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 2.4 శాతం పెరిగి 128.5 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒక శాతం అధికం. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో వంట నూనెలు 5.1 శాతం, చక్కెర 7.2 శాతం, గోధుమలు 4.3 శాతం పెరిగాయి. ఎరువులు, మొక్కజొన్న ధరలు కూడా పెరిగాయి. అయితే యుద్ధ సమయంలో, బియ్యం ధరలు మాత్రమే తగ్గుముఖం పట్టాయి.
Iran Israel war
Food prices
Middle East conflict
Global food crisis
FAO
United Nations
Wheat prices

More Telugu News