LPG Gas Cylinder: 5 కేజీల గ్యాస్ సిలిండర్లకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు: కేంద్రం

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా, కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయవచ్చని శనివారం స్పష్టం చేసింది. సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళన చెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఔట్‌లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

ముఖ్యంగా వలస కార్మికులు, స్థానిక చిరునామా పత్రాలు లేని వారిని దృష్టిలో ఉంచుకుని 5 కేజీల సిలిండర్ నిబంధనను సరళతరం చేసినట్లు అధికారులు వివరించారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 5.7 లక్షల సిలిండర్లను ఈ పద్ధతిలో విక్రయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని, రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. మరోవైపు, అక్రమ నిల్వలు, నల్ల బజారును అరికట్టేందుకు నిఘా పెంచామని, ఇటీవల 3,700కు పైగా దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు పేర్కొంది.
LPG Gas Cylinder
Gas Cylinder
5kg LPG Cylinder
Address Proof
Ministry of Petroleum
West Asia Crisis
Fuel Supply
Gas shortage
Indian Oil
Bharat Petroleum

More Telugu News