Rajinikanth: అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్

Rajinikanth drops big update on Jailer 2
షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ రజనీకాంత్ తన చిత్రం 'జైలర్ 2'పై కీలక అప్‌డేట్ ఇచ్చారు. శనివారం ఎయిర్‌పోర్ట్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని వెల్లడించారు. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.

2023 ఆగ‌స్టులో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'జైలర్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తొలి భాగం విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ సీక్వెల్‌లో నటించినట్లు సమాచారం. దీంతో 'జైలర్ 2'పై అంచనాలు మరింత పెరిగాయి.

రాబోయే ఎన్నికల గురించి ప్రజలకు ఏం చెబుతారని మీడియా అడగ్గా, రజనీకాంత్ కేవలం నవ్వుతూ ఆ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలిసి నటించబోయే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రశ్నించగా, ఆ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో మొదలవుతుందని స్పష్టం చేశారు.

Go Back to Shorts
Rajinikanth
Jailer 2
Jailer movie
Nelson Dilipkumar
Sun Pictures
Anirudh Ravichander
Kamal Haasan
Ramya Krishnan
Mohanlal
Vijay Sethupathi

More Telugu News