Jaishankar: ఇంటా, బయటా ఎదురైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్

ఇతర దేశాల నుంచి మాత్రమే కాకుండా, అంతర్గతంగా ఎదురైన సవాళ్లను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారత్ సామర్థ్యాలను పరీక్షిస్తూనే ఉన్నాయని అన్నారు. ఐఐఎం రాయ్‌పూర్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఇతర దేశాలతో పాటు అంతర్గతంగా సవాళ్లు ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల నుంచి భారత్ దృఢంగా బయటపడిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న మార్పులను అంగీకరించడంలో కొన్ని దేశాలు ఇబ్బందిపడుతున్నాయని అన్నారు. ఈ పరిణామాలతో ఆ దేశాల్లో వస్తోన్న మార్పులతో ప్రపంచక్రమం మారుతోందని అన్నారు. సరికొత్త సాంకేతికతలు, సవాళ్లు ఈ పోటీ వాతావరణంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రోత్సహించాయని అన్నారు.

ఎన్నో దేశాల్లో ఆశావాదం కొరవడిందని, కానీ మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఆశావాద వాతావరణమే కనిపించిందని, రానున్న పదేళ్లు కూడా అలాగే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటి అని గుర్తు చేశారు. ఇటీవల మన సామర్థ్యాలను పరీక్షించిన ఎన్నో షాక్‌ల నుంచి మనం విజయవంతంగా బయటపడ్డామని అన్నారు.
Jaishankar
S Jaishankar
Indian Foreign Policy
India Challenges
Global Challenges
IIM Raipur

More Telugu News