Oracle: దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి?
దుబాయ్‌లోని ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి చేసిందంటూ వస్తున్న వార్తలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
దుబాయ్ ఇంటర్నెట్ సిటీలో ఉన్న ఒరాకిల్ భవనాన్ని ఇరాన్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం 'ఎక్స్' వేదికగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఒరాకిల్ కార్యాలయంపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవ విరుద్ధమైనవి" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి పుకార్లు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల్లోని వాణిజ్య, సాంకేతిక కేంద్రాలపై దాడులు జరగవచ్చనే ఆందోళనలు ఈ ప్రచారానికి కారణమయ్యాయి.
అయితే, ఒరాకిల్ కార్యాలయం వద్ద ఎలాంటి దాడి జరగలేదని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అక్కడ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని, ఎటువంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించలేదని తెలిపారు. అనధికారిక వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశంలోని పౌరులు, విదేశీయులు, వాణిజ్య సంస్థల భద్రతకు కట్టుబడి ఉన్నామని యూఏఈ పునరుద్ఘాటించింది.