Rakasa Movie: 'రాకాస' మూవీ చూసిన‌ వ‌రుణ్ తేజ్ ఏమ‌న్నారంటే..!

Varun Tej Reviews Rakasa Movie Entertaining Comedy
షార్ట్స్‌లో చూడండి
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తున్నారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఆమె నిర్మించిన రెండో చిత్రం ‘రాకాస’. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ నేడు థియేటర్లలోకి రానుంది. అయితే, నిన్న రాత్రి కొన్ని చోట్ల మూవీ ప్రీమియ‌ర్ షోలు ప‌డ్డాయి. ఈ ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తుండటం విశేషం.

మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లవ్, కామెడీ, ఫాంటసీ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

'రాకాస' ఎంటర్‍టైనింగ్‍గా ఉంది.. సంగీత్ శోభన్ టాలెంట్ అద్భుతం: వరుణ్ తేజ్
తాజాగా ఈ సినిమాను వీక్షించిన నిహారిక సోదరుడు, హీరో వరుణ్ తేజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన రివ్యూ ఇచ్చారు. సినిమా ఎంతో వినోదాత్మకంగా ఉందని, ముఖ్యంగా కామెడీ అద్భుతంగా పండిందని ప్రశంసించారు. "‘రాకాస’ చూశాను, చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కామెడీ ఈ సినిమాలో హైలైట్, నవ్వు ఆపుకోలేరు. సంగీత్ శోభన్ అద్భుతమైన టాలెంట్. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను అదరగొట్టేశారు. డైరెక్టర్ మానస శర్మ, నా స్టార్ ప్రొడ్యూసర్ నిహారికకు శుభాకాంక్షలు" అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ చేశారు. వరుణ్ ప్రశంసతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Go Back to Shorts
Rakasa Movie
Varun Tej
Niharika Konidela
Sangeeth Shobhan
Manasa Sharma
Telugu Movie Review
Pink Elephant Pictures
Getup Srinu
Vennela Kishore
Telugu Cinema

More Telugu News