Nara Lokesh: హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్
"ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు. అమరావతి రైతులు గెలిచిన రోజు. అమరావతి మహిళలు గెలిచిన రోజు" అని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మనందరం మద్రాసు రాజధానిగా మద్రాసు స్టేట్ లో ఉన్నామని, దాని తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అందులో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
మూడేళ్ల తర్వాత ఒక ఒప్పందం వల్ల మళ్లీ తెలంగాణా, ఆంధ్ర కలిపి హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. 58 సంవత్సరాలు కష్టపడి, చెమటోడ్చి అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రజలు కలసికట్టుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నామని, ఒక చీకటిరోజు పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్రరాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు.
మెడపట్టి బయటకు గెంటేశారన్న బాధ ఉంది
ఆనాడు చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకు వెళ్లాలని లేకపోతే విభజన వల్ల ఒక ప్రాంతం లబ్ధి పొందినా మరో ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది చెప్పారని గుర్తు చేశారు. అయినా వినకుండా ఏకపక్షంగా ఆంధ్రరాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. తాను పుట్టిపెరిగింది తెలంగాణాలోనే అని, హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తనకు తెలుసు అన్నారు. అయితే ఆరోజున కట్టుబట్టలతో మెడబట్టి బయటకు గెంటేశారన్న బాధ, ఆవేదన కలిగిందని అన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు, కూర్చునేదానికి సెక్రటేరియట్ లేదు, శాసనసభ సమావేశాలు నిర్వహించుకునేందుకు అసెంబ్లీ లేదు, హైకోర్టు లేదు, పదేళ్లు హైదరాబాద్ మీ రాజధాని, ఆ తర్వాత మీదారి మీరు వెతుక్కోండని విభజన సమయంలో చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.
అశాస్త్రీయ రాష్ట్ర విభజన దారుణం
విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్రానివో తేలని దుస్థితి నెలకొందని అన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆనాడు హైదరాబాద్ లో గల శాసనసభలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సమదూరంలో రాజధాని ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ప్రకటించారని అన్నారు. ఆ సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పారని, అందులో భాగంగా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చారని అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఆనాడు రైతులకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన, చివరకు వైసీపీ కూడా భరోసా ఇచ్చాయని గుర్తు చేశారు. అందరూ అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారని, అందుకే 5 కోట్ల ఆంధ్రుల కోసం తమ భూములు రాజధాని కోసం ఇస్తున్నామని అక్కడి రైతులు చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు.
మూడు ముక్కలాటపై అలుపెరుగని పోరాటం
పొరపాటున ప్రభుత్వం మారితే అమరావతి రాజధానిగా ఉండదు, తరలిస్తారని తాము 2019 ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పామని లోకేశ్ తెలిపారు. ఆనాటి ప్రతిపక్షనేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, రాజధానిని ఎక్కడకూ తీసుకెళ్లనని చెప్పి ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై అనేక ఆరోపణలు చేసి మూడుముక్కలాట మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు శాసనసభలో తమ ఎమ్మెల్యేలు పోరాడారని, కౌన్సిల్‌లో మాకు మెజారిటీ ఉండటంతో కౌన్సిల్ సాక్షిగా మేమంతా పోరాడామని అన్నారు. తాను కూడా ఆనాడు శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని సభ్యులమంతా కోరినా, అప్పటి శాసనసభా వ్యవహారాల మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ సంతకం లేకుండా బిల్లు పాసైందని చెప్పి, గవర్నర్ ఆమోదానికి పంపించారని మండిపడ్డారు. తెలిసో, తెలియకో గవర్నర్ ఆ రోజు అనుమతి ఇచ్చారని అన్నారు. తాము న్యాయపోరాటం చేయగా, వారు తప్పుచేశారని కోర్టు ఆక్షింతలు వేసిందని తెలిపారు.
రైతులను వెంటాడి వేధించారు
"ఆరోజు నుంచి ప్రజారాజధాని కోసం ఉద్యమం మొదలైంది. పెద్దఎత్తున రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడారు. ఉద్యమించినందుకు వారిని అన్నిరకాలుగా అవమానించారు, వారిపై దాడిచేశారు. శాంతియుతంగా వారు అమరావతి నుంచి తిరుమలకు, సింహాచలంకు పాదయాత్ర చేయాలన్నా అనేక ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. రాజధాని గ్రామాల్లో ప్రజలు స్వస్థలాల్లో తిరగాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన పరిస్థితులు కల్పించారు, ఐదేళ్లు 144వ సెక్షన్ పెట్టారు. ప్రజలను అన్నిరకాలుగా వేధించారు. 5కోట్ల ఆంధ్రులు అదంతా ప్రత్యక్షంగా చూశారు. అందుకే వారిలో ఆవేదన, బాధ కలిగాయి.
ఆనాడు మేం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని చెప్పాం. అదే నినాదంతో మేమంతా ఎన్డీయే కూటమిగా గత ఎన్నికల్లో కలసికట్టుగా పోటీచేశాం. అందుకే ప్రజలు 94 శాతం మ్యాండేట్ ప్రజలు మాకిచ్చారు. గత పాలకులు ఎక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామని మాయమాటలు చెప్పారో అక్కడే విశాఖ ప్రజలు మా ఎంపీని అత్యధికంగా 5 లక్షల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిపించారు. విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు జిల్లాల ప్రజలంతా అమరావతికే మద్దతుగా నిలిచారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అమరావతే మా రాజధాని అని తెలుగు ప్రజలు స్పష్టం చేశారు" అని లోకేశ్ తెలిపారు.
ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ -11 అనేక దుష్ప్రచారాలు చేసిందని, ఇప్పుడు కూడా చేస్తున్నారని లోకేశ్ వాపోయారు. మళ్లీ పొరపాటున అధికారంలోకి వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారని ధ్వజమెత్తారు. వారి తప్పుడు ప్రచారం ఆంధ్రరాష్ట్రానికి, అమరావతికి రావాల్సిన పెట్టుబడులు నెమ్మదించాయని అన్నారు. ఇప్పటికే చాలా నష్టపోయాం, మా భవిష్యత్తు ఏమిటని రైతుల్లో కూడా ఆందోళన వచ్చిందని అన్నారు. అంధ్రప్రదేశ్ కు అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధత ఉండాలని రైతులంతా కోరారని, అందులో భాగంగా సభలో రోజంతా దీనిపై చర్చించినట్లు తెలిపారు. అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలని ఏక్రగీవంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారుని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పార్లమెంటులో బిల్లు పాస్ చేయించేందుకు చొరవచూపారని వెల్లడించారు.
యావత్ భారతదేశం అండగా నిలబడింది
ఒకే ఒక్క పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడిందని అన్నారు. చాలామంది ఈరోజు రాజ్యసభలో మాట్లాడారని తెలిపారు.
"అమరావతికి మద్దతివ్వడం ప్రారంభం మాత్రమే, అంతా ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలబడాలని, ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయిదేళ్లు చాలా నష్టపోయింది. టీమ్-11 పార్టీ మినహా మేమంతా అండగా ఉంటామని అన్నిపార్టీలు కలసికట్టుగా మద్దతునిచ్చాయి. బీజేపీ, జనసేన, జేడీయు, అటుపక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ ఇలా అందరూ ముక్తకంఠంతో ఏపీ శాశ్వత రాజధాని అమరావతి అని మాట్లాడారు. ఈరోజు కూడా రాజ్యసభలో కరెక్టుగా 11పార్టీలు మాట్లాడాయి. గత పాలకులు చేసిన పొరపాట్లకుగాను 11 నెంబర్ వారిని వెంటాడుతోంది. ఒకపార్టీ మాత్రం వాకౌట్ చేసింది. అది ప్యాషనో, మరేమిటో సీసీడీ (క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉన్న వ్యక్తిని మీరంతా అడగాలి. మొత్తం భారతదేశం ఈరోజు ఆంధ్రులకు అండగా నిలబడింది. ఇందుకు రాష్ట్రప్రజలంతా గర్వపడాలి. మాపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా అమరావతి పనులు పూర్తిచేస్తాం. ప్రధానిమంత్రి మోడీజీని తీసుకెళ్లి నూతన రాజధానికి రిబ్బన్ కటింగ్ చేయించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడేవిధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం" అని లోకేశ్ వివరించారు.
విలేకరుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు:
మీడియా ప్రతినిధులు: లోక్ సభలో చర్చ టివీలో చూశారు, రాజ్యసభ చర్చ ప్రత్యక్షంగా చూశారు, మీరు ఎలా ఫీలయ్యారు?
లోకేశ్: అపోహలు తొలగిపోయాయి. రైతులు, మహిళలు చేసిన పోరాటం ఫలించింది. ఇక అభివృద్ధి దిశగా ముందుకెళ్లబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఎంపీలంతా నిలబడి పార్లమెంటుకు నమస్కరించారు. అమరావతిని, 5 కోట్ల ఆంధ్రులను కాపాడింది పార్లమెంటే.
మీడియా ప్రతినిధులు: దేశంలోని అన్నిపార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి కాబట్టి భవిష్యత్తులో దీనిని కదల్చడానికి అవకాశం లేదని అనుకోవచ్చా?
లోకేశ్: నూటికి నూరుశాతం, నేను చెప్పిన మాటలను డేట్, టైమ్ రాసిపెట్టుకోండి. యావత్ భారతదేశం 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి నినదించింది. ఇక ఎవరూ రాజధానిని తాకలేరు.
మీడియా ప్రతినిధులు: తాము వస్తే రాజధాని మారుస్తామని జగన్ అంటున్నారు కదా?
లోకేశ్: నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసి నాకు డౌటొచ్చింది. నేనే కష్టపడ్డాను, పార్లమెంటుకు బిల్లు తీసుకువచ్చానని అంటాడేమోనని అనుకున్నా. ఎందుకంటే ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉంది. ఆర్సెలర్ మిట్టల్ ప్లాంటు విషయంలో ఆయన చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. తొలుత ఆ పరిశ్రమ యాజమాన్యం వేరే రాష్ట్రానికి కమిట్ అయింది, లోకేశ్ ప్రజలను మోసగిస్తున్నాడని నా పేరును ప్రస్తావిస్తూ చెప్పారు. అదే వ్యక్తి ఫౌండేషన్ తర్వాత దావోస్ నేనే మాట్లాడి ఆ కంపెనీని తీసుకొచ్చానని అన్నారు. ఆయనను ఏమనాలో అర్థం కావడంలేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి రాడు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. సుదీర్ఘంగా ఒకే పార్టీ అధికారంలోకి ఉండటం వల్లే ఈరోజు గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందింది. ఒడిశాలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. 21నెలల్లో ఎన్ని పరిశ్రమలు ఏపీకి తెచ్చామో చూడండి. ఇంతలా పెట్టుబడులు వస్తాయని ఎవరైనా ఊహించారా? కాగ్నిజెంట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఎసీలు తయారుచేసే కంపెనీలు తీసుకొచ్చాం. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను తెచ్చాం. ఇంకా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఇవన్నీ రావడానికి మాకు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పేరే చంద్రబాబునాయుడు.
మీడియా ప్రతినిధులు: జగన్ చెబుతున్న మావిగన్‌పై మీ అభిప్రాయం ఏమిటి?
లోకేశ్: ఆయన వైజాగ్‌లో ఉందామని ఇల్లు కట్టడానికి ప్రయత్నించాడు. దానిని కూడా సరిగా పూర్తిచేయలేకపోయాడు. కేవలం ఒక్క ఇల్లు కట్టలేని వ్యక్తి రాజధాని నిర్మిస్తారా? అయిదేళ్లలో ఆయన రాష్ట్రంలో కనీసం ఒక్క రోడ్డయినా వేశారా? కనీసం గోతులైనా పూడ్చారా? అటువంటి వ్యక్తి ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవరు నమ్ముతారు. మాది ఒకే ప్లాన్. అది అమరావతి మాత్రమే, అది మారే ప్రసక్తే లేదు.
మీడియా ప్రతినిధులు: అమరావతికి పార్లమెంటులో ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయని మీరు ఊహించారా?
లోకేశ్: ఆ క్రెడిట్ అంతా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీకే దక్కుతుంది. మా కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీనేత కృష్ణ, హరీష్ తదితర సభ్యులంతా కలసికట్టుగా ప్రతి పార్టీని సంప్రదించారు. అమరావతి మద్దతు ఎందుకు ఇవ్వాలో అర్థమయ్యేలా వివరించారు. అమరావతి రైతులు పడిన కష్టాలు, అవమానాలు ఇక్కడ చాలామందికి తెలియదు. మా సభ్యులంతా మాట్లాడి పార్లమెంటులో చైతన్యం తెచ్చారు. ఇటీవల ఏ విషయంలోనూ పార్లమెంటులో ఏకాభిప్రాయం రాలేదు. కేవలం ఒకే ఒక పార్టీ (వైసీపీని ఉద్దేశించి) మినహా భారతదేశం మొత్తం మాకు అండగా నిలబడింది. టీడీపీ పార్లమెంటు సభ్యులంతా చాలా కష్టపడ్డారు.
మీడియా ప్రతినిధులు: ఈరోజు ప్రధానిమంత్రిని కలిసి ఏం మాట్లాడారు?
లోకేశ్: నేను ప్రధానమంత్రి గారితో ఒక్కటే చెప్పాను. ఈరోజు అమరావతి రైతులు హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఆయన కృషి, ప్రోత్సాహం వల్ల బిల్లు ఆమోదం పొందింది, 5 కోట్ల ఆంధ్రుల తరపున ధన్యవాదాలు తెలిపాను. ప్రధాని అందిస్తున్న సహకారం వల్ల అమరావతి, పోలవరం, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రధాని స్పందిస్తూ, "వ్యక్తులు, అధికారం శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థను మనం పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. వ్యవస్థలు దెబ్బతింటే దేశం దెబ్బతింటుంది. ఇది కరెక్టు కాదు" అని చెప్పారు. భోగాపురం ఎయిర్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. మీరు రావాలని కోరగా, తప్పనిసరిగా వస్తానని చెప్పారు. మా ఎంపీలందరితో ప్రధాని ఈరోజు ఫోటోలు దిగారు. "మీరంతా హ్యాపీగా ఉన్నారా" అని ప్రధాని అడిగారు, "ఆంధ్రరాష్ట్రం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారు" అని చెప్పాం. 2014లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఏపీకి ప్రచారానికి వచ్చినపుడు ఆయన బిడ్డను బతికించారు, తల్లిని చంపేశారని అన్నారు. ఇప్పటికీ ఆయన ఆ మాటలను గుర్తుపెట్టుకున్నారు. ఆంధ్రరాష్ట్రాన్ని సొంతకాళ్లపై నిలబడేవరకు ఆదుకోవాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు టెక్నాలజీలో వెరీ గుడ్, ఆయన అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ చేస్తే దేశానికి తిరిగి మీరు కంట్రిబ్యూట్ చేయగలుగుతారని చెప్పారు, ఎకనమిక్ యాక్టివిటీస్ వేగవంతంచేసి ముందుకెళ్లాలని చెప్పారు. గతంలో అమిత్ షాను కలిసినపుడు కూడా ఆయన నాకు ఇదే చెప్పారు.
మీడియా ప్రతినిధులు: అమరావతిలో ఎయిర్ పోర్టు, స్పోర్ట్స్ సిటీ పనులు ఎప్పటినుంచి ప్రారంభిస్తారు?
లోకేశ్: స్పోర్ట్స్ సిటీ పనులు వెంటనే ప్రారంభిస్తాం. ఎయిర్ పోర్టుకు సంబంధించిన పనులపై దృష్టిసారించాం. ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తాం. నరేంద్ర మోదీ స్టేడియం ఒక్కటే ఉంటుంది. దానితో ఎవరూ పోటీపడలేరు. మరో దానిని సృష్టించడం సాధ్యం కాదు. అయితే మేము కూడా ఒక వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మిస్తాం.
మీడియా ప్రతినిధులు: పార్లమెంటు వేదికగా వైసీపీ చేసిన ఆరోపణలను ఏవిధంగా తిప్పకొట్టబోతున్నారు?
లోకేశ్: ఆరోపణలు చేసిన వారిని నేను సూటిగా ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారే, అప్పుడు వారికి అధికంగా ఖర్చుచేస్తున్నామనే ఆలోచన రాలేదా? చదరపు అడుగు 4 వేల డిస్కషన్ అప్పుడు ఏమైంది? రుషికొండ ప్యాలెస్ కు రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. ఎన్జీటీ మాపై మరో రూ.200 కోట్లు ఫైన్ వేసింది. ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లు ఖర్చుపెట్టారు. వారు మాకు నీతులు చెబుతారా? మేం ముఖ్యమంత్రి కోసం ఇల్లు కట్టడం లేదు. మేం రాజధాని కట్టేది వ్యక్తుల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని నిర్మిస్తున్నాం. జగన్ ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం. ఆయనకు ఏ విషయం పైనా కనీస అవగాహన లేదు. జాతీయ రహదారి, అమరావతి రహదార్లను పోల్చి ఎక్కువ ఖర్చుచేస్తున్నామని చెబుతున్నారు. 8 లైన్ల రహదార్ల నిర్మాణంలో మేం ఎన్‌హెచ్ఎఐ తో సమానంగానే ఖర్చు చేస్తున్నాం. అయితే 2 లైన్ల రోడ్లను అమరావతిలో 8 లైన్ల రోడ్లతో పోల్చి ఎక్కువ ఖర్చు చేస్తున్నామని ఎలా చెబుతారు. కనీసం ఆలోచన ఉండాలి కదా? 2014-19 మధ్య వేసిన రోడ్లపై ఒక్క గొయ్యి కూడా పడలేదు. ముందుచూపుతో అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించాం. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించి తీరుతాం. 30 లక్షలమంది వచ్చి అక్కడ నివసించినా సరిపోయే విధంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో మెట్రో పెట్టడానికి కూడా అవకాశం ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందించి రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇప్పుడున్న వైసీపీ నేతలే 5 వేల ఎకరాల ఎయిర్ పోర్టు అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్టు చూడండి. ఇదే విజనరీకి, ప్రిజనరీకి మధ్యన ఉన్న వ్యత్యాసం. 5 కోట్ల ఆంధ్రులు ఈ విషయాన్ని గమనించాలి.
మీడియా ప్రతినిధులు: అమరావతి తొలిదశ పనులు ఎప్పుడు పూర్తిచేయబోతున్నారు?
లోకేశ్: రెండేళ్లలో పూర్తి చేస్తాం. పోలవరం కూడా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా నిర్ణీత సమయంలోపే పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు ప్రధాని నరేంద్రమోదీని పిలుస్తాం. ఏం పేరు పెట్టాలన్నది ముఖ్యమంత్రిగారు నిర్ణయిస్తారు.