Shahhed Drone: ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న వేళ, ఇరాక్ గగనతలంలో ఒక నాటకీయ ఘటన చోటుచేసుకుంది. ఇరాన్‌కు చెందిన 'షాహెద్' డ్రోన్‌ను అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానం వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రయోగించిన ఈ ఆత్మాహుతి డ్రోన్ ఇరాక్ గగనతలంలోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన అమెరికా వాయుసేన, అడ్డుకునేందుకు తమ ఎఫ్-15 యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది. అమెరికా ఫైటర్ జెట్ డ్రోన్‌కు అత్యంత సమీపంగా వెళ్లి దానిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆ డ్రోన్‌ను కూల్చివేశారా? లేక దాని మార్గాన్ని మళ్లించారా? అన్న దానిపై స్పష్టత లేదు.
ఇరాన్ 'షాహెద్' డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించి, లక్ష్యాలను ఢీకొట్టి పేలిపోతాయి. గతంలో రష్యా వీటిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు పూర్తి అండగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఈ తాజా ఘటన ఇరాన్, అమెరికా మధ్య వైరాన్ని మరింత పెంచేలా ఉంది. తమ గగనతలాన్ని ఇరు దేశాలు యుద్ధ క్షేత్రంగా మార్చవద్దని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఈ ఘటనపై ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు చర్చిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో, ఇరాన్ తన డ్రోన్లను సరిహద్దులు దాటించి ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో ఇరాక్ గగనతలంలో ప్రయాణిస్తున్న ఇరాన్ ‘షాహెద్’ ఆత్మహుతి డ్రోన్‌ను అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఎఫ్-15 యుద్ధ విమానం, ఆ డ్రోన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించింది.