ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘ‌న‌త‌!

Sports
Advertisement
  • తొలి బంతికే ఐదుసార్లు వికెట్‌ తీసిన ఏకైక బౌలర్‌గా ఘనత
  • షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి
  • ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ
Advertisement
లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి పాలైంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను షమీ ప్రారంభించాడు. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఔట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీయడం షమీకి ఇది ఐదోసారి. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక బౌలర్‌గా షమీ నిలిచాడు.

ఈ జాబితాలో షమీ తర్వాత ఏడుగురు బౌలర్లు తలో మూడుసార్లతో రెండో స్థానంలో ఉన్నారు. వారిలో ప్రవీణ్ కుమార్, ఉమేశ్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, భువనేశ్వర్ కుమార్, అశోక్ దిండా, ప్యాట్ క‌మ్మిన్స్ ఉన్నారు.

అయితే, షమీ అద్భుత ఆరంభాన్ని లక్నో సద్వినియోగం చేసుకోలేకపోయింది. 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చిన సమీర్ రిజ్వీ అద్భుతంగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ తమ ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను ఘనంగా ప్రారంభించగా, లక్నోకు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

చైనాలో 'టెంపరరీ పిల్లలు'.. ఏమిటీ ట్రెండ్?

04 Nov, 21:45

చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే 'సమ్మర్ హాలిడేస్'.. ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక

04 Nov, 21:39

'మురసు' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

04 Nov, 21:34

బంతితోనే కాదు.. బుర్రతోనూ.. కవ్వించి మరీ టిక్నర్‌ను ఔట్‌ చేసిన బ్రార్‌!

04 Nov, 21:30

ఇండిగో భారీ ప్లాన్.. 100 కొత్త విమానాలకు ఆర్డర్!

04 Nov, 20:52

గాజులాంటి తల.. లోపల తిరిగే కళ్లు.. ఇలాంటి చేపను ఎప్పుడూ చూసి ఉండరు!

04 Nov, 20:45

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈశ్వర్‌ కిరణ్ కుమార్ రెడ్డికి ఈడీ కస్టడీ

04 Nov, 20:31

మెర్సిడెస్ కొత్త ఈవీ 'జీఎల్ సీ ఎలక్ట్రిక్'.. మార్చి వరకు బుకింగ్స్ పూర్తి

04 Nov, 20:15

సదర్ వేడుకల్లో సీఎం రేవంత్.. యాదవులకు కీలక హామీలు

04 Nov, 20:15

కోహ్లీ క్రీజులో ఉంటే బౌలర్లకు కష్టాలు తప్పవు.. నాకు అర్థమైంది ఇదే: డఫీ

04 Nov, 20:01

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎస్ఈసీ పునేఠా

04 Nov, 20:01

బస్సులో మహిళా ఎంపీ చెంపపై కొట్టిన కాంగ్రెస్ ఎంపీ.. వీడియో వైరల్

04 Nov, 19:48

వయసు 40 దాటిందా? ఈ మూడు హెల్త్ టెస్టులు తప్పనిసరి!

04 Nov, 19:39

స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు కూటమికే అండగా నిలిచారు: మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

04 Nov, 19:31

హీరోకి చాలా గట్స్.. 'ఇట్లు అర్జున' ట్రైలర్ లాంచ్ చేసి, టీమ్‌ను మెచ్చుకున్న ఎన్టీఆర్

04 Nov, 19:24
..More Telugu News