Amazon: అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై ఇరాన్ దాడి చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ దాడి తర్వాత ఓ కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయని, వాటిని అదుపులోకి తెచ్చామని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అయితే, ఆ కంపెనీ పేరును గానీ, నష్టం వివరాలను గానీ వెల్లడించలేదు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలో అమెజాన్, యాపిల్, టెస్లా వంటి అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై అమెజాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, గతవారమే ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా తమ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)కు అంతరాయం కలిగిందని కంపెనీ అంగీకరించింది.
డేటా సెంటర్లే ఎందుకు లక్ష్యం?
ఒకప్పుడు కేవలం పౌర మౌలిక సదుపాయాలుగా భావించిన డేటా సెంటర్లను ఇప్పుడు యుద్ధాల్లో వ్యూహాత్మక ఆస్తులుగా చూస్తున్నారు. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, కమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాలు క్లౌడ్ సేవలపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా సైనిక, నిఘా కార్యకలాపాలకు ఈ క్లౌడ్ సేవలు సహకరిస్తున్నాయని, అందుకే వీటిని చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తున్నామని ఇరాన్ వాదిస్తోంది.
సైబర్ దాడుల నుంచి యుద్ధం ఇప్పుడు ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలిచే భౌతిక డేటా సెంటర్లపై దాడుల దిశగా మారుతోందని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాణిజ్యపరమైన డేటా సెంటర్‌పై ఒక దేశం నేరుగా భౌతిక దాడికి పాల్పడటం ఇదే మొదటిసారని వారు చెబుతున్నారు. ఈ పరిణామంతో డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది.