Ian Williams Langford: ఐపీఎల్ లో విషాదం... బ్రాడ్ కాస్ట్ ఇంజినీర్ హఠాన్మరణం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో విషాదం చోటుచేసుకుంది. టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ పనుల కోసం భారత్‌కు వచ్చిన ఒక బ్రిటిష్ ఇంజినీర్ ముంబైలోని హోటల్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
మృతుడిని 76 ఏళ్ల ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్‌గా గుర్తించారు. సోమవారం దక్షిణ ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లోని తన గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆయన్ను సమీపంలోని బాంబే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాంగ్‌ఫోర్డ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, అందులో అనుమానాస్పద విషయాలేవీ వెలుగు చూడలేదని పోలీసులు తెలిపారు.
కాగా, మంగళవారం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘మా బ్రాడ్‌కాస్ట్ కార్యకలాపాల్లో కీలక సభ్యుడైన ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఐపీఎల్ నిర్వహణలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశాయి.