Oracle: టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఈ-మెయిల్‌తో ఉద్యోగాలకు మంగళం!

ప్రముఖ క్లౌడ్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం ఉదయాన్నే అనేకమంది ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపి, వారి ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. ఈ పరిణామం టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

అమెరికాలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ రావడం మొదలైంది. "సంస్థ ప్రస్తుత వ్యాపార అవసరాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, సంస్థాగత మార్పులలో భాగంగా మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం. దీని ఫలితంగా, ఈ రోజే మీకు చివరి పనిదినం" అని ఆ మెయిల్‌లో ఒరాకిల్ స్పష్టంగా పేర్కొంది.

త్వరలోనే కంప్యూటర్, ఈ-మెయిల్, ఫైల్స్ యాక్సెస్‌ను నిలిపివేస్తామని, ఆ తర్వాత లాగిన్ కావడం సాధ్యం కాదని కూడా తెలిపింది. కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని కాపీ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం నిషేధమని ఉద్యోగులను హెచ్చరించింది.

నివేదికల ప్రకారం, ఒరాకిల్ సుమారు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 18 శాతానికి సమానం. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన వారికి సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తామని, దీని వివరాలను వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు పంపుతామని కంపెనీ వెల్లడించింది. 2025 మే నాటికి కంపెనీలో దాదాపు 1,62,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 
Oracle
Oracle layoffs
Oracle job cuts
Tech layoffs
Cloud technology
Severance package
Employee terminations
Layoff news
IT industry
Job market

More Telugu News