Sagrada Familia: 144 ఏళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న అత్యంత ఎత్తైన చర్చి... ఎక్కడో చూడండి!
స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో ఉన్న ప్రఖ్యాత సగ్రాడా ఫెమిలియా చర్చి నిర్మాణం ఒక చారిత్రక మైలురాయిని చేరుకుంది. దాదాపు 144 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ అద్భుత కట్టడం బాహ్య నిర్మాణం పూర్తయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా చరిత్ర సృష్టించింది. ఈ ఫిబ్రవరిలో చర్చి యొక్క ఆరు ప్రధాన టవర్ల నిర్మాణం పూర్తి కావడంతో, బార్సిలోనా నగరానికి ఇది ఒక కొత్త గుర్తింపు చిహ్నం గా నిలిచింది.
గౌడీ కల... 144 ఏళ్ల నిరీక్షణ
ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆంటోని గౌడీ సారథ్యంలో 1882లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభమైంది. గోతిక్, ఆర్ట్ నూవో శైలుల మిశ్రమంతో ఆయన రూపొందించిన ఈ డిజైన్ నిర్మాణ రంగంలోనే ఒక అద్భుతంగా నిలిచింది. గౌడీ తన జీవితంలోని చివరి 43 సంవత్సరాలను ఈ ప్రాజెక్టుకే అంకితం చేశారు. అయితే, 1926లో ఒక ప్రమాదంలో ఆయన హఠాన్మరణం చెందడంతో ప్రాజెక్ట్ నిర్మాణం మందగించింది. ఆయన మరణ సమయానికి చర్చి నిర్మాణం నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాత స్పానిష్ అంతర్యుద్ధం, నిధుల కొరత, సాంకేతిక సవాళ్లు వంటి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, పట్టువదలకుండా నిర్మాణం కొనసాగిస్తూ వచ్చారు. గౌడీ పార్థివదేహాన్ని ఇదే చర్చి క్రిప్ట్లో ఖననం చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని 2010లో పోప్ బెనెడిక్ట్ XVI బసిలికాగా ప్రకటించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చ్
ఇటీవల చర్చిలోని అత్యంత పొడవైన టవర్ "జీసస్ క్రైస్ట్ టవర్" నిర్మాణం పూర్తి కావడంతో, ఈ చర్చి 172.5 మీటర్ల (566 అడుగులు) ఎత్తుకు చేరుకుంది. ఈ టవర్ శిఖరాగ్రాన 56 అడుగుల ఎత్తైన నాలుగు భుజాల శిలువను ఒక భారీ క్రేన్ సహాయంతో అమర్చారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చిగా సగ్రాడా ఫెమిలియా రికార్డు సృష్టించింది. జర్మనీలో తయారైన ఈ శిలువను వైట్ ఎనామెల్డ్ సెరామిక్ టైల్స్, కాటలోనియా ప్రాంతానికి చెందిన గాజుతో నిర్మించారు. పగలు, రాత్రి వేళల్లో ప్రకాశవంతంగా కనిపించేలా దీన్ని రూపొందించడం గౌడీ వాస్తుశిల్ప దార్శనికతకు నిదర్శనం.
ముగింపు దశకు నిర్మాణం
బాహ్య నిర్మాణం పూర్తయినప్పటికీ, చర్చి ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. అంతర్గత అలంకరణలు, శిల్పాలు, క్లాడింగ్ వంటి పనులు పూర్తి కావడానికి మరో ఎనిమిది సంవత్సరాలు పట్టవచ్చని అంచనా. 2034 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, దీని నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ పూర్తిగా ప్రైవేట్ విరాళాల ద్వారానే సమకూరుతున్నాయి. కరోనా మహమ్మారి వంటి ఆధునిక సవాళ్లను కూడా ఎదుర్కొని నిర్మాణం నిరంతరాయంగా కొనసాగడం విశేషం.
శతాబ్ది ఉత్సవాలు.. భవిష్యత్ ప్రణాళికలు
2026 సంవత్సరం ఆంటోని గౌడీ మరణించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ చారిత్రక మైలురాయికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మద్దతు కూడగట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇటాలియన్ కళాకారుడు ఆండ్రియా మాస్ట్రోవిటో రూపొందించిన 'ఆగ్నస్ డీ' (దేవుని గొర్రెపిల్ల) శిల్పం వంటి కళాఖండాలను ఇక్కడ అమర్చనున్నారు. నిర్మాణం పూర్తవడంతో బార్సిలోనా స్కైలైన్కు కొత్త అందం వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలలో ఒకటిగా ఉన్న సగ్రాడా ఫెమిలియా, ఇకపై మరింత మందిని ఆకట్టుకోనుంది.

1930లో ఇలా..