Poonam Pandey: బేబీ బంప్‌తో పూనమ్ పాండే ఫొటోలు.. మళ్లీ డ్రామా అంటున్న నెటిజన్లు
వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్‌ను పైకి మడిచి బేబీ బంప్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి క్యాప్షన్‌గా గర్భవతి, పాలసీసా ఎమోజీలను జోడించారు.
క్యాన్సర్ డ్రామా తర్వాత.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ.. పూనమ్‌పై నెటిజన్ల అనుమానం
అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఆమె పబ్లిసిటీ స్టంట్లలో భాగమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె చేసిన ఫేక్ ప్రచారమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. 2024 ఫిబ్రవరిలో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే ఈ డ్రామా ఆడానని చెప్పడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
తాజా ప్రెగ్నెన్సీ ప్రకటన కూడా ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కొందరు నెటిజన్లు అయితే ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించినవి కావొచ్చని కామెంట్లు చేస్తున్నారు. 2011 క్రికెట్ ప్రపంచకప్ భారత్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని చెప్పి పూనమ్ పాండే వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు పెట్టడం, విడాకులు తీసుకోవడం వంటి పరిణామాలతో వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన 'లాక్ అప్' షోలో ఆమె చివరిసారిగా కనిపించారు.