Revanth Reddy: రేషన్ 'సన్నబియ్యం'తో సీఎం రేవంత్ రెడ్డి లంచ్... పక్కనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల్లో సరఫరా చేసే సన్న బియ్యంతో భోజనం చేశారు. అసెంబ్లీలోని సెంట్రల్ హాలులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 'సన్న బియ్యం లంచ్' ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ హాలులో ఈ లంచ్ ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుని భోజనం చేశారు. ముఖ్యమంత్రి, కోమటిరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఈ లంచ్‌లో పాల్గొన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఆలోచన తనది అయినప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
Revanth Reddy
Telangana
Sanna Biyyam
Ration Rice
Komati Reddy Raj Gopal Reddy
Uttam Kumar Reddy

More Telugu News