KCR: కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారనేది నా అనుమానం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ భావిస్తున్నారని... కానీ, ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారేమో అనేది తన అనుమానం అని అన్నారు. రావణుడి వల్లే రాముడి గొప్పతనం ఏమిటో తెలిసిందని... అలాగే కేసీఆర్ ఉండటం వల్ల తనకు గుర్తింపు వచ్చిందని చెప్పారు.

నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ నేత కె. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవి అవగాహన లేని వ్యాఖ్యలని, లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదని ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా భౌగోళికంగా గ్యాప్ అలాగే ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణను తెలివిగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

సీట్ల పెంపు విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. కేంద్రానికి కేవలం ఐదు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు సరిపోతాయని, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీట్ల పెంపులో ఈ వ్యత్యాసం కొనసాగితే భవిష్యత్తులో బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలకు రాజకీయంగా అవకాశాలు ఉండవని, దేశంలో నియంత పోకడలు పెరుగుతాయని సెటైర్లు వేశారు.

KCR
K Chandrasekhar Rao
Revanth Reddy
Telangana
BRS
K Laxman
BJP
Constituency delimitation
North vs South politics
Bandi Sanjay
Kishan Reddy

More Telugu News