Indian Rupee: రూపాయి భారీ పతనం.. డాలర్ మారకంతో 95 స్థాయికి పడిపోయిన రూపాయి

భారత కరెన్సీ రూపాయి సోమవారం నాడు డాలర్ మారకంతో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి రోజురోజు నష్టపోతోంది. ఈరోజు డాలర్ మారకంతో 95.14 వద్ద కనిష్ఠస్థాయికి పడిపోయింది. రూపాయి 95 స్థాయికి పడిపోవడం ఇది మొదటిసారి. గతవారం కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి ఈరోజు ఉదయం కాస్త కోలుకుంది. ఈరోజు ప్రారంభంలో 130 పైసలు లాభపడి 93.59 వద్ద ప్రారంభమైంది. కానీ సెషన్ ముగిసేసరికి ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది.

రూపాయి బలహీనతకు ఎన్నో కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యాలెర్‌కు 109 డాలర్లకు పైన ఉంది. దీనితో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నారు.

ఈ నెలలో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి సుమారు 11.5 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం సుమారు రూ.850 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు విక్రయించారు. ఇలా వివిధ కారణాలతో రూపాయి అత్యంత బలహీనమవుతోంది.
Indian Rupee
Rupee vs Dollar
USD INR
Indian Currency
Rupee Fall
Rupee Value
Brent Crude Oil

More Telugu News