నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

MK Stalin Files Nomination for Tamil Nadu Assembly Elections
  • నాలుగోసారి కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్
  • ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందన్న ముఖ్యమంత్రి
  • ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని వ్యాఖ్యలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు.

నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూరు, తూర్పు తిరుచ్చి నుంచి బరిలోకి దిగుతున్న విజయ్, తాజాగా పెరంబూరు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్‌ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ, నేను ఎంపిక చేసిన వారు కేవలం ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మాత్రమే కాదని, వారు ప్రజలకు రక్షకులు అని అన్నారు. వారికి మీ మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
Advertisement
MK Stalin
Tamil Nadu Elections
Vijay TVK
Kolathur Constituency
Perambur Constituency
Tamil Nadu Politics

More Telugu News