Chandrababu Naidu: టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu Naidu greets TDP workers on 44th anniversary
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

‘తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది కార్యకర్తల పార్టీ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను,’ అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు.

పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తమ పార్టీ సదా పాటిస్తోందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తను ఆయన అభినందించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
TDP 44th anniversary
Telugu Desam Party
NTR
Andhra Pradesh
party celebrations
Telugu people
party workers

More Telugu News