Masoud Pezeshkian: మీరు అలా చేయాల్సిందే: గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక

మీకు అభివృద్ధి, భద్రత, శాంతి కావాలనుకుంటే, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను మీ భూభాగాల మీద నుండి దాడులు చేయకుండా నిరోధించాలని గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తమ పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ దేశాలలోని స్థావరాల నుంచి అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు గల్ఫ్ దేశాలకు హెచ్చరిక జారీ చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులు ఆగాలన్నా, శాంతి, అభివృద్ధి నెలకొనాలన్నా తాము చెప్పినట్లు వినాలని స్పష్టం చేశారు. ఆయా దేశాల గగనతలాలను వినియోగించుకుని శత్రువులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గగనతలాలను వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు అనుమతి ఇవ్వవద్దని షరతు విధించారు.

బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇతర పశ్చిమాసియా దేశాలను ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరించారు. ఇరాన్ ఎప్పుడూ ముందుగా దాడులు చేయదని స్పష్టంగా చెప్పామని అన్నారు. కానీ తమ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలు, అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తప్పదని పలుమార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. శత్రుస్థావరాలు భూస్థాపితమయ్యే వరకు దాడులు చేస్తామని స్పష్టం చేశారు. శత్రువులకు సహకరించిన వారిని కూడా వదిలేది లేదన్నారు.
Masoud Pezeshkian
Iran
Gulf countries
Middle East
US attacks Iran
Israel
Iran nuclear program

More Telugu News