Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కొనసాగుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాలు తెలిపాయి.
నిన్న శుక్రవారం (మార్చి 27) మొత్తం 67,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 25,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ. 3.45 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
గురువారంతో పోలిస్తే శుక్రవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం (మార్చి 26) 65,600 మంది భక్తులు దర్శనం చేసుకోగా, సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. గురువారం హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లుగా నమోదైంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.