Suicide: లోన్ యాప్ వేధింపులు.. కాకినాడలో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య
లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చలేక యాప్ నిర్వాహకులు పెట్టిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు ఓ లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే, ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
ఈ ఒత్తిడిని తట్టుకోలేక, తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.