Kash Patel: ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ల బృందం హండాలా టీమ్ ప్రకటించుకుంది. కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, పలు ఫైళ్లను ఇంటర్నెట్లో పోస్టు చేసింది. హ్యాకింగ్‌కు గురైన బాధితుల జాబితాలో, ఇకమీదట కాష్ పటేల్ పేరు కూడా ఉంటుందని పేర్కొంది. ఈ సైబర్ నేరగాళ్లకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈ-మెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని అమెరికా న్యాయశాఖకు అధికారి ఒకరు ధృవీకరించారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారికంగా స్పందించవలసి ఉంది. హండాలా టీమ్‌కు పాలస్తీనా అనుకూల హ్యాకర్లుగా పేరు ఉంది. ఈ హండాలా బృందాన్ని ఇరాన్ ప్రభుత్వ సైబర్ నిఘా విభాగం ఉపయోగించుకుంటోందనే వాదనలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మిచిగాన్కు చెందిన సంస్థను హ్యాక్ చేసినట్లు కూడా హండాలా టీమ్ ప్రకటించుకుంది.