MS Dhoni: ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీకి ఇదే చివరి సీజన్ కావచ్చని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో, అతడి ఫిట్నెస్ను ప్రశంసిస్తూ మరో పదేళ్ల పాటు ఆడాలని సూచించారు.
ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ విమర్శకులపై మండిపడ్డారు. "ధోనీ ఇంకా ఆడుతున్నాడు. రాబోయే 10 ఏళ్లు కూడా ఆడాలి. ఎందుకంటే అతను క్రమశిక్షణతో తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. అతని చేతుల్లో బలం ఇప్పటికీ అద్భుతంగా ఉంది. ధోనీ ఒక గొప్ప వ్యక్తి. రిటైర్ అవ్వమని చెప్పడానికి మీరెవరు? క్రికెట్ పట్ల అతని నిబద్ధతకు హ్యాట్సాఫ్" అని అన్నారు. యోగరాజ్ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
అయితే, యోగరాజ్ అభిప్రాయంతో భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ విభేదించాడు. జియోస్టార్‌తో మాట్లాడుతూ, ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చని అంచనా వేశాడు. "ఇది ధోనీ చివరి సీజన్‌గా అనిపిస్తోంది. చెన్నై జట్టులోకి సంజూ శాంసన్ వంటి వికెట్‌కీపర్‌ను తీసుకున్నారు. భవిష్యత్తులో ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా శాంసన్‌ను తీర్చిదిద్దవచ్చు. ధోనీ స్వయంగా అతనికి బాధ్యతలు అప్పగించాలనుకోవచ్చు" అని పఠాన్ విశ్లేషించాడు.
వయసు కారణంగా ధోనీ చివరి రెండు ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడని, ఆటగాడిగా మరిన్ని ఓవర్లు ఆడి బాధ్యత తీసుకోవాలని పఠాన్ సూచించాడు. కాగా, ఐదుసార్లు చెన్నైకి టైటిల్ అందించిన ధోనీ, తన భవిష్యత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.