Naga Shaurya: నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్
యువ హీరో నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ ప్రకటనతో నాగశౌర్య అభిమానులు, సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ దేశిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. "విజయాన్ని, ఉత్సాహాన్ని, హై-వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి" అంటూ నిర్మాణ సంస్థ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఈ టీజర్లో నాగశౌర్య రగ్గ్డ్, అగ్రెసివ్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించారు. యాక్షన్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ మూమెంట్స్‌తో టీజర్ ఆకట్టుకుంది. నాగశౌర్యతో పాటు సముద్రఖని, నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ వంటి కీలక నటీనటులు కనిపించడంతో, సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంటుందని స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు సముద్రఖని 'వరదా రెడ్డి' అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్. చాలా కాలం తర్వాత ఆయన ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.